సాయంత్రాలు ఇంటిల్లిపాదీతో గడిపే అనుభవమే వర్ణనాతీతం . కాసేపలాగే ఒక చోట కూర్చుని నిలబడితే చాలు ఆ ఆనందమంతా ఒక్కసారిగా హరించుకుపోతుంది. ఏముంది కీళ్ళ నొప్పులు. మామూలుగా కూర్చుని నిలబడ్డప్పుడే కాదు, మెట్లు ఎక్కుతున్నప్పుడు గానీ, ఇంకేదైనా పని చేస్తున్నపుడు గానీ ఈ కీళ్ళ నొప్పులు రావడం సర్వ సాధారణం. ఒకసారి ఈ నొప్పి మొదలైందంటే అడుగు తీసి అడుగు కూడా వేయలేం.
ఈ కీళ్ళ నొప్పులు వయసుపై బడ్డవారికి , ఆటలు ఆడేవారికే కాదు, పోషకాహారం లోపించిన వారెవరికైనా ఉండవచ్చు.చిన్నగా మందులతో మొదలై చివరికి ఆపరేషన్ వరకు వెళ్తుంది పరిస్థితి, అప్పటికీ సమస్య తగ్గుతుందా అంటేగ్యారంటీ లేదు. అందుకే పరిస్థితి విషమించక ముందే కీళ్ళ నొప్పుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే కీళ్ళ నొప్పులతో ఉపశమనమే కాదు, అసలు కీళ్ళ నొప్పులు దరికి కూడా రావు.
సోయా
సోయాలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు వాటితో పాటు ఉన్న అమినో ఆసిడ్స్ కీళ్ళ నొప్పులు తగ్గడంలో ఔషదంలా పని చేస్తాయి. మూడు నెలల పాటు సోయాను ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి.సోయాను బర్గర్లో , ఉడకబెట్టిన కూరగాయలతో, సలాడ్ లతో పాటు తినవచ్చు.
పండ్లు
పండ్లు
విటమిన్ సి ఉన్న ఏ ఆహారమైనా కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఔషధమే, నారింజ, స్ట్రా బెర్రీ, క్రాన్ బెర్రీ, కిర్నికాయ్,రాస్ప్ బెర్రీ, గ్రేప్ ఫ్రూట్, బొప్పాయి, మరియు బ్లూ బెర్రీస్ ఈ పండ్లన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ ల చేసుకుని రోజుకి ఒకసారి తిన్నా చాలు, కీళ్ళ నొప్పులు ఎంతో కాలం నిలవవు. రోజూ బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ ని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి చాలు, మీరు కీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టే.
ఆకుకూరలు
ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని చెప్పని వారుండరు , వినని వారూ ఉండరు, కానీ పాటించే వాళ్ళే చాలా తక్కువమంది .పాటించని వారిలోనే ఉంటారు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .ప్రత్యేకంగా కీళ్ళ నొప్పుల విషయంలోనే కాదు, శరీరానికి కావలసిన విలువైన పోషకాలు ఆకుకూరల్లో సమృద్ధంగా ఉంటాయి.మీరు తినే ఆహారంలో ఏ రూపంలోనైనా, సాండ్ విచ్ రూపంలోనో,మీరు తాగే వెజ్ టేబుల్ జ్యూస్ లోనో ఏదో రూపంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి.
దినుసులు
రోజూ తినే ఆహారం దాల్చిన చెక్క, జిలకర, పసుపు తప్పకుండా ఉండేలా చూసుకోండి, ఇవి తినే ఆహారానికి రుచిని మాత్రమే కీళ్ళకు బలాన్ని కూడా ఇస్తాయి.
చేపలు
చేపలు, లేదా చేప నూనె కీళ్ళ నొప్పులను తగ్గించే విషయంలో ఔషధకారిగా పని చేస్తుంది. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం,ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్,సిలీనియం, ఫ్లూరైడ్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహరం చేపలు, ఇవి మీ ఆహారంలో అధిక మోతాదులో ఉండేటట్లు చూసుకోండి.
మరీ కీళ్ళనొప్పి అధికంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం, ఈ లోపు ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న చోట ఉంచితే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.