Friday 30 November 2012

Healthy food can cure Joint pain


సాయంత్రాలు ఇంటిల్లిపాదీతో గడిపే అనుభవమే వర్ణనాతీతం కాసేపలాగే ఒక చోట కూర్చుని నిలబడితే చాలు ఆ ఆనందమంతా ఒక్కసారిగా హరించుకుపోతుంది. ఏముంది కీళ్ళ నొప్పులు.  మామూలుగా కూర్చుని నిలబడ్డప్పుడే కాదుమెట్లు ఎక్కుతున్నప్పుడు గానీఇంకేదైనా పని చేస్తున్నపుడు గానీ ఈ కీళ్ళ నొప్పులు రావడం సర్వ సాధారణంఒకసారి ఈ నొప్పి మొదలైందంటే అడుగు తీసి అడుగు కూడా వేయలేం.
ఈ కీళ్ళ నొప్పులు వయసుపై బడ్డవారికి ఆటలు ఆడేవారికే కాదుపోషకాహారం లోపించిన వారెవరికైనా ఉండవచ్చు.చిన్నగా మందులతో మొదలై చివరికి ఆపరేషన్ వరకు వెళ్తుంది పరిస్థితిఅప్పటికీ సమస్య తగ్గుతుందా అంటేగ్యారంటీ లేదు. అందుకే పరిస్థితి విషమించక ముందే కీళ్ళ నొప్పుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే కీళ్ళ నొప్పులతో ఉపశమనమే కాదుఅసలు కీళ్ళ నొప్పులు దరికి కూడా రావు.
సోయా
సోయాలో ఉండే కాల్షియంమెగ్నీషియంప్రోటీన్లు వాటితో పాటు ఉన్న అమినో ఆసిడ్స్ కీళ్ళ నొప్పులు తగ్గడంలో ఔషదంలా పని చేస్తాయిమూడు నెలల పాటు సోయాను ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి.సోయాను బర్గర్లో ఉడకబెట్టిన కూరగాయలతోసలాడ్ లతో పాటు తినవచ్చు.
పండ్లు
విటమిన్ సి ఉన్న ఏ ఆహారమైనా కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఔషధమేనారింజస్ట్రా బెర్రీక్రాన్ బెర్రీకిర్నికాయ్,రాస్ప్ బెర్రీగ్రేప్ ఫ్రూట్బొప్పాయిమరియు బ్లూ బెర్రీస్ ఈ పండ్లన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ ల చేసుకుని రోజుకి ఒకసారి తిన్నా చాలుకీళ్ళ నొప్పులు ఎంతో కాలం నిలవవురోజూ బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ ని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి చాలుమీరు కీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టే.
ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని చెప్పని వారుండరు వినని వారూ ఉండరుకానీ పాటించే వాళ్ళే చాలా తక్కువమంది .పాటించని వారిలోనే ఉంటారు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .ప్రత్యేకంగా కీళ్ళ నొప్పుల విషయంలోనే కాదుశరీరానికి కావలసిన విలువైన పోషకాలు ఆకుకూరల్లో సమృద్ధంగా ఉంటాయి.మీరు తినే ఆహారంలో ఏ రూపంలోనైనాసాండ్ విచ్ రూపంలోనో,మీరు తాగే వెజ్ టేబుల్ జ్యూస్ లోనో ఏదో రూపంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి.
దినుసులు
రోజూ తినే ఆహారం దాల్చిన చెక్కజిలకరపసుపు తప్పకుండా ఉండేలా చూసుకోండిఇవి తినే ఆహారానికి రుచిని మాత్రమే కీళ్ళకు బలాన్ని కూడా ఇస్తాయి.
చేపలు
 
చేపలులేదా చేప నూనె కీళ్ళ నొప్పులను తగ్గించే విషయంలో ఔషధకారిగా పని చేస్తుందికాల్షియంఐరన్మెగ్నీషియం,ఫాస్ఫరస్పొటాషియంసోడియంజింక్కాపర్మాంగనీస్,సిలీనియంఫ్లూరైడ్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహరం చేపలుఇవి మీ ఆహారంలో అధిక మోతాదులో ఉండేటట్లు చూసుకోండి
  మరీ  కీళ్ళనొప్పి అధికంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమంఈ లోపు ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న చోట ఉంచితే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.

No comments:

Post a Comment

If you want more health tips please let me know